శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 24, 2020 , 16:48:36

జి జిన్‌పింగ్‌పై వ్య‌తిరేక వ్యాఖ్య‌లు.. పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌

జి జిన్‌పింగ్‌పై వ్య‌తిరేక వ్యాఖ్య‌లు.. పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌

బీజింగ్‌ : చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను బహిరంగంగా విమర్శించ‌డం అదేవిధఃగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన కార‌ణంపై అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ రాజకీయ, సంస్థాగత, సమగ్రత, పని విభాగాలను తీవ్రంగా ఉల్లంఘించినందుకుగాను రెన్ జికియాంగ్(69)‌ను పార్టీ నుండి బహిష్కరించినట్లు సీపీసీ పేర్కొంది. అవినీతికి పాల్ప‌డ‌టం, లంచం తీసుకోవ‌డం, ప్ర‌జా నిధుల దుర్వినియోగంతో పాటు గోల్ఫ్ స‌భ్య‌త్వ కార్డుల దుర్వినియోగం వంటి ఆరోప‌ణ‌ల‌ను రెన్ ఎదుర్కొంటున్న‌ట్లు వెల్ల‌డించింది. రెన్ బ‌హిష్క‌ర‌ణ‌ను బీజింగ్ జిల్లా పర్యవేక్షక కమిటీ, జిచెంగ్ జిల్లా కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్స్పెక్షన్ ప్రకటించింది.

రియల్ ఎస్టేట్ అభివృద్ధి సంస్థ హువాయువాన్ ప్రాపర్టీస్ మాజీ చైర్‌పర్సన్ అయిన‌ రెన్ కరోనా వైరస్ మహమ్మారిని ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్ నిర్వహించిన విధానాన్ని విమర్శించినందుకు గా‌ను మార్చిలో ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. రెన్ చైనా సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు. అతను బ‌హిరంగంగా మాట్లాడ‌టం, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో అంద‌రూ అత‌న్ని ఫిరంగి గా పిలుస్తారు. సీపీసీకి మీడియా ఎలా సేవ చేయాలనే దాన్ని జి జిన్‌పింగ్ ప్ర‌సంగ ప్ర‌చారాన్ని చూసి నేర్చుకోవాల‌న్న విమ‌ర్శ‌లు చేసినందుకుగాను రెన్ ను 2016 ప్రారంభంలో చైనా సోషల్ మీడియా నుండి నిషేధించారు.

చైనా స్టేట్ మీడియా ప్రకారం నగరాల్లో అపార్టుమెంట్లు కొనలేని పేద యువ వలస కార్మికులు గ్రామీణ ప్రాంతాలకు తిరిగి రావాలంటూ రెన్ సూచించారు. కరోనావైరస్ వ్యాప్తికి అధ్య‌క్షుడి ప్రతిస్పందనపై ప‌లు వ్యాసంలో విమర్శలు చేసినందుకుగాను మార్చిలో రెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. క‌రోనా వైర‌స్‌కు ముందు అనంత‌రం జరిగిన అనేక సంఘ‌ట‌న‌ల క్ర‌మం గురించి అనేక ప్ర‌శ్న‌ల‌ను వ్యాసంలో లేవ‌నెత్తాడు. 

క‌రోనా మ‌హ‌మ్మారి చూపిన వాస్తవికత ఏమిటంటే పార్టీ తన స్వంత ప్రయోజనాలను కాపాడుకుంటుంది. ప్రభుత్వ అధికారులు తమ సొంత ప్రయోజనాలను కాపాడుకుంటారు. చక్రవర్తి ముఖ్య అనుచ‌ర‌గ‌ణం హోదా, ప్రయోజనాలను మాత్రమే సమర్థిస్తాడు. ఈ రకమైన వ్యవస్థ ప్రజలను పట్టించుకోకుండా పాలకుడి ఆజ్ఞల‌ను మాత్రమే పాటించే పరిస్థితిని కలిగి ఉంటుంద‌ని రెన్ వ్యాసంలో పేర్కొన్నాడు.logo