e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home అంతర్జాతీయం హెచ్‌1బీ తిరస్కృతులకు ఉపశమనం

హెచ్‌1బీ తిరస్కృతులకు ఉపశమనం

  • వారి విజ్ఞప్తుల పరిశీలనకు బైడెన్‌ 
  • ప్రభుత్వం కీలక నిర్ణయం 
  • భారతీయ నిపుణులకు ప్రయోజనం

వాషింగ్టన్‌, మార్చి 13: ట్రంప్‌ హయాంలో మూడు విధానపరమైన నిర్ణయాల వల్ల హెచ్‌1బీ వంటి వీసాలు తిరస్కరణకు గురైన విదేశీ ఉద్యోగుల అభ్యర్థనలను, అభ్యంతరాలను తిరిగి పరిశీలిస్తామని అమెరికాలోని బైడెన్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్‌) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో వేల మంది భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనం చేకూరనున్నది. స్థానిక అమెరికన్లకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ట్రంప్‌ సర్కారు కఠినమైన వలస విధానాన్ని అనుసరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటి కఠిన, వివక్షాపూరిత నిబంధనల కారణంగా అనేకమంది వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పుడు వీరి అభ్యర్థనలను తిరిగి సమీక్షించాలని తాజాగా బైడెన్‌ సర్కారు నిర్ణయించింది. హెచ్‌1బీ అనేది నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా. దీని కోసం భారతీయులే ఎక్కువగా పోటీపడుతుంటారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హెచ్‌1బీ తిరస్కృతులకు ఉపశమనం

ట్రెండింగ్‌

Advertisement