శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Mar 06, 2020 , 13:12:01

జేమ్స్‌బాండ్‌కు కరోనా దెబ్బ

జేమ్స్‌బాండ్‌కు కరోనా దెబ్బ

లండన్‌, మార్చి 5: ప్రపంచంలోని ఏ మూలకైనా చొచ్చుకెళ్లి మిషన్‌ను పూర్తిచేసే ‘జేమ్స్‌ బాండ్‌' కూడా కరోనా దెబ్బకు బెంబేలెత్తాడు. జేమ్స్‌బాండ్‌ సిరీస్‌లోని తాజా సినిమా ‘నో టైమ్‌ టు డై’. డానియల్‌ క్రెగ్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ రెండోవారంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉన్నది. అయితే.. కరోనా దెబ్బకు అనేక దేశాల్లో ప్రజలు సినిమాలకు దూరంగా ఉండటం, అతిపెద్ద మార్కెట్‌ అయిన చైనాలో థియేటర్లు మూతపడటంతో జేమ్స్‌ బాండ్‌ వెనక్కి తగ్గాడు. ఈ చిత్రాన్ని నవంబర్‌ 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు గురువారం ప్రకటించారు.


logo