శుక్రవారం 15 జనవరి 2021
International - Jan 03, 2021 , 03:06:46

దోస్తీకి బైడెన్‌ చొరవ చూపొచ్చు: చైనా

దోస్తీకి బైడెన్‌ చొరవ చూపొచ్చు: చైనా

బీజింగ్‌: అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ముగింపు పలుకుతారని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి బలోపేతం అవుతాయని, అంతర్జాతీయ అంశాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకొంటాయని పేర్కొన్నారు.