శనివారం 06 జూన్ 2020
International - Apr 05, 2020 , 17:31:08

వృద్ధుల వైద్యం లేద‌క్క‌డ‌!

వృద్ధుల వైద్యం లేద‌క్క‌డ‌!

వృద్ధుల వైద్యం లేద‌క్క‌డ‌!

స్పెయిన్‌లో క‌రోనా విజృంభిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 12,500 మంది వైర‌స్ కార‌ణంగా మృతి చెందారు. అయితే పాజిటివ్ వ‌చ్చిన‌వారు ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్నారు. దీంతో అక్క‌డి ఆస్ప‌త్రుల‌న్నీ కిట‌కిట‌లాడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో 60 ఏండ్లు పై బ‌డిన వారికి వైద్యులు చికిత్స చేయ‌కుండా వెన‌క్కి పంపిస్తున్నారు. వ‌య‌సులో ఉన్న‌వారి ప్రాణాలు కాపాడేందుకు ఇక్క‌డి వైద్యులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో చాలా మంది వృద్ధులు ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఇంటివ‌ద్దే ఉంటున్నారు. కాక‌పోతే వీరికి ఇంటివ‌ద్దే చికిత్స అందించేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది.logo