ఆదివారం 12 జూలై 2020
International - Jun 30, 2020 , 16:32:39

చైనా కాన్సులేట్‌ ఎదుట టిబెటన్‌ యూత్‌ కాంగ్రెస్‌ నిరసన

చైనా కాన్సులేట్‌ ఎదుట టిబెటన్‌ యూత్‌ కాంగ్రెస్‌ నిరసన

టొరంటో : కెనడా దేశంలోని టోరంటో నగరంలోగల చైనా కాన్సులేట్‌ ఎదుట ఆ దేశానికి వ్యతిరేకంగా ప్రాంతీయ టిబెటన్‌ యూత్‌ కాంగ్రెస్‌ నిరసన తెలిపింది. లద్దాఖ్‌లోని గాల్వాన్‌లోయలో చైనా భద్రతాదళాల చొరబాట్లను వ్యతిరేకిస్తూ భారత్‌కు మద్దతుగా సంఘీభావం ప్రకటించారు. చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘భారత్‌కు మద్దతుగా టిబెట్‌ నిలుస్తుంది. భారత భద్రతాదళాలకు కృతజ్ఞతలు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇటీవల అమెరికాలోని న్యూయార్క్‌, న్యూజెర్సీలోనూ ప్రాంతీయ టిబెటన్‌ యూత్‌ నాయకులు ఇదేతరహాలో నిరసన వ్యక్తం చేశారు. లద్దాఖ్‌లోని గాల్వాన్‌ లోయలో జూన్‌ 15, 16న చైనా బలగాలకు-భారత భద్రతాదళాలకు మధ్య జరిగిన ఘర్షణలో 20మంది సైనికులతోపాటు ఓ కర్నల్‌ స్థాయి అధికారి మృతి చెందారు. చైనా వైపు నుంచి సైతం 43మంది చనిపోయారని, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని భారత్‌ వెల్లడించింది.logo