మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Oct 03, 2020 , 19:15:23

మాస్కు పెట్టుకోవాలని 102 ఏళ్ల ముందే చెప్పారట..!

మాస్కు పెట్టుకోవాలని 102 ఏళ్ల ముందే చెప్పారట..!

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి నేపథ్యంలో మాస్కు తప్పనిసరైంది. మాస్కు పెట్టుకోవాలని అటు వైద్యులు, ఇటు ప్రభుత్వాలు ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు జారీచేస్తూనే ఉన్నాయి. అయితే, ఈ విషయాన్ని ఇంటర్నేషనల్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ (ఐసీఆర్సీ) 102 ఏళ్ల ముందే చెప్పింది. స్పానిష్‌ ఫ్లూ సందర్భంగా జారీచేసిన ఈ సూచనకు సంబంధించిన ఓ నోట్‌ను ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెట్టగా, వైరల్‌ అవుతోంది. 

1918లో స్పానిష్‌ ఫ్లూ మహమ్మారి విజృంభించింది. ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నది. ఆ వ్యాధి ఒకరినుంచి ఒకరికి ప్రబలకుండా ఉండాలంటే మాస్కు తప్పనిసరైంది. ఇదే విషయాన్ని ఐసీఆర్సీ నోట్‌రూపంలో అందరికీ సూచించింది. ‘మాస్కులు ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి..’ అనేది దాని సారాంశం. 102 ఏళ్ల క్రితం విడుదలైన నోట్‌ను ఐసీఆర్సీ ఇప్పుడు షేర్‌చేస్తూ ‘మేము దీనిని 1918లో చెప్పాం. 2020లోనూ చెబుతున్నాం.’ అని ట్వీట్‌ చేసింది. దీనిని 7,000 మందికి పైగా లైక్‌ చేశారు. 3,300 రీట్వీట్లు వచ్చాయి.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo