గురువారం 22 అక్టోబర్ 2020
International - Sep 27, 2020 , 18:07:19

మ‌హిళ కారులో విష‌పూరిత‌మైన పాము.. ఎక్క‌డ దాక్కుందంటే!

మ‌హిళ కారులో విష‌పూరిత‌మైన పాము.. ఎక్క‌డ దాక్కుందంటే!

పాముల‌కు భూమి మీద ఎక్క‌డా ప్ర‌దేశం లేన‌ట్లు కారు, వాషింగ్ మెషీన్‌, టాయిలెట్స్‌ల‌లో మ‌కాం పెడుతున్నాయి. పెడితే పెట్టాయి. పాపం జ‌నాల‌ను భ‌య‌పెడితే ఎలా? కారులో ఉండే అయితే సేఫ్‌గా ఉంటుంద‌ని ఓ మ‌హిళ కారులోని గ్లోవ్ కంపార్ట్మెంట్ లోపల కేబుల్స్‌, ఫోన్ వంటి విలువైన వ‌స్తువుల‌ను భ‌ద్ర‌ప‌రుచుకున్న‌ది. ఒక‌రోజు రోజుటిలాగానే కారు గ్లోవ్ కంపార్ట్మెంట్‌ను తెరిచింది. న‌ల్ల‌గా, లావుగా కేబుల్ మాదిరిగా ఒక పాము లోప‌లికి ఇరుక్కొని ఉన్న‌ది.

దాన్నిచూసిన మ‌హిళ కెవ్వుమ‌ని అరిచి వెంట‌నే కారు దిగేసింది. ఈ సంఘ‌ట‌న ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న‌ది. ఇది అత్యంత విష‌పూరిత‌మైన పాముల‌లో ఒక‌టి. ఈ విష‌యాన్ని ఆండ్రూస్ స్నేక్ రిమూవ‌ల్ ద్వారా పేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. స్నేక్ రెస్క్యూవ‌ర్స్ వ‌చ్చి పామును బ‌య‌ట‌కు తీశారు. పామును లాగుతుంటే అది అంత సులువుగా బ‌య‌ట‌కు రాలేదు. చివ‌రికి సుర‌క్షితంగా పామును బ‌య‌ట‌కు తీశారు. ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. 


logo