శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 30, 2020 , 15:03:47

లాక్‌డౌన్‌తో త‌గ్గిన కార్బ‌న్ ఉద్గారాల విడుద‌ల‌

లాక్‌డౌన్‌తో త‌గ్గిన కార్బ‌న్ ఉద్గారాల విడుద‌ల‌


‌హైద‌రాబాద్‌: ప్ర‌పంచ‌వ్యాప్తంగా కార్బ‌న్ ఉద్గారాల విడుద‌ల‌ రికార్డు స్థాయిలో త‌గ్గ‌నున్న‌ట్లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఎన‌ర్జీ ఏజెన్సీ పేర్కొన్న‌ది. ఈ ఏడాది సుమారు ఎనిమిది శాతం ఉద్గారాల విడుద‌ల త‌గ్గ‌నున్న‌ట్లు తెలిపింది.  లాక్‌డౌన్ వ‌ల్ల బొగ్గు, ఇంధ‌నం, గ్యాస్‌కు డిమాండ్ ప‌డిపోయింద‌ని, దాంతో వాటి నుంచి విడుద‌ల‌య్యే వ్య‌ర్థాలు కూడా త‌గ్గిన‌ట్లు ఐఈసీ పేర్కొన్న‌ది. అయితే గ‌త వంద రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విద్యుత్తు డిమాండ్ ప‌డిపోయిన‌ట్లు ఐఈఏ గ్లోబ‌ల్ రివ్యూలో పేర్కొన్నారు. లాక్‌డౌన్ వ‌ల్ల ఎన‌ర్జీకి డిమాండ్ ప‌డిపోయింది. 2020 సంవ‌త్స‌రంలో ఎన‌ర్జీ డిమాండ్ ఆరు శాతం ప‌డిపోనున్న‌ట్లు అంచ‌నా వేశారు. ఇది 2008లో త‌లెత్తిన సంక్షోభంతో పోలిస్తే ఏడు రెట్లు ఎక్కువ‌. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత కూడా ఈ స్థాయిలో ఎప్పుడు ఎన‌ర్జీ డిమాండ్ ప‌డిపోలేదట‌. 


logo