చైనాకు చెందిన వాంగ్‌పై వదంతులు
బిల్‌గేట్స్‌తో ఎఫైర్ అంటూ ప్రచారం
న్యూఢిల్లీ, మే 10: ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్, ఆయన భార్య మెలిండా మధ్య విభేదాలు రావడానికి, వివాహబంధం నుంచి విడిపోవడానికి చైనాకు చెందిన షీ షెల్లీ వాంగ్నే కారణం అని వదంతులు వెల్లువెత్తుతున్నాయి. వాంగ్, బిల్‌గేట్స్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నదని అందువల్లే మెలిండా విడాకులు తీసుకొంటున్నారని ఆ వదంతుల సారాంశం. వాంగ్ వయస్సు 36 ఏండ్లు. గేట్స్ ఫౌండేషన్‌లో అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. ఇంకా పెండ్లి కాలేదు. ఈ వదంతులను ఆమె ఖండించారు. వాంగ్‌పై ఎవరు ఎందుకు వదంతులు వ్యాపింపజేశారన్నది తెలియలేదు.