శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 25, 2020 , 08:24:12

అమెరికాలో ఒక్కరోజే 38వేలకు పైగా కరోనా కేసులు

అమెరికాలో ఒక్కరోజే 38వేలకు పైగా కరోనా కేసులు

న్యూయార్క్‌: అమెరికాలో కరోనావైరస్‌ విజృంభిస్తున్నది. దేశంలో నిన్న ఒక్కరోజే 38,764 కేసులు నమోదవగా, ఈ వైరస్‌ ప్రభావంతో 1,951 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం 9.25 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు మృతిచెందినవారి సంఖ్య 52,185కు చేరింది. ప్రపంచ ఆర్థిక రాజధాని, అమెరికాలో కరోనాకు కేంద్రబిందువుగా మారిన న్యూయార్క్‌లో ఇప్పటివరకు 2,76,711 కరోనా కేసులు నమోదవగా, 21,283 మంది మృతిచెందారు. న్యూజెర్సీలో కరోనా కేసుల సంఖ్య 1,02,196కు చేరింది. నగరంలో ఇప్పటివరకు 5,617 మంది మరణించారు. 


logo