మంగళవారం 27 అక్టోబర్ 2020
International - Sep 19, 2020 , 19:58:19

అత‌ని ఇంటి కింద రూ. 23.7 ​​కోట్ల విలువైన ఐజాక్ న్యూటన్, గెలీలియో గెలీలీ పుస్త‌కాలు

అత‌ని ఇంటి కింద రూ. 23.7 ​​కోట్ల విలువైన ఐజాక్ న్యూటన్, గెలీలియో గెలీలీ పుస్త‌కాలు

గ్రామీణ రొమేనియాలోని ఓ బిల్డింగ్‌లో రూ .23.7 ​​కోట్ల విలువైన ఐజాక్ న్యూటన్, గెలీలియో గెలీలీ పుస్త‌కాల‌ను పోలీసులు క‌నుగొన్నారు.  'ఈ పుస్త‌కాలు చాలా విలువైన‌వి. అంత‌ర్జాతీయ సాంస్కృతిక వారసత్వానికి చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి' అని డిటెక్టివ్ ఇన్స్పెక్ట‌ర్ ఆండీ డ‌ర్హం పేర్కొన్నారు. 2017వ సంవ‌త్స‌రంలో లండ‌న్‌లో జ‌రిగిన దాడిలో ఈ అరుదైన పుస్త‌కాలు దొంగిలించ‌బ‌డ్డాయి. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం దొంగ‌లు ఇంటి పైక‌ప్పు నుంచి రంధ్రాలు వేసుకొని ఎస్కేప్ అయ్యారు. వీరితో పాటు 16 పెద్ద సంచుల్లో పుస్త‌కాలు వేసుకొని ప‌రార్ అయ్యారు అని చెప్పుకొచ్చారు. ఇటలీలోని లండన్, రొమేనియా, కారాబినియరీల పోలీసులు జరిపిన దర్యాప్తులో ఇలాంటి 11 దోపిడీలను గుర్తించారు.

దీనికి ఈయూ ఏజెన్సీ యూరోపోల్‌, హేగ్‌లోని యూరోజ‌స్ట్ మ‌ద్ద‌తు ఇచ్చారు. సుమారు 2 మిలియ‌న్ పౌండ్ల విలువైన ఆస్తి దొంగిలించ‌బ‌డింది. ఈ దోపిడీకి రోమేనియ‌న్ వ్య‌వ‌స్థీకృత క్రైమ్ ముఠానే కార‌ణ‌మ‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఈ ద‌ర్యాప్తు వ‌ల్ల జూన్ 2019 లో మూడు దేశాలలో వరుస దాడులకు దారితీసింది. దోపిడీకి పాల్పడిన‌ 13 మంది నిందితులను యూకేలో అరెస్టు చేసి అభియోగాలు మోపారు. ఇందులో 12 మంది నిందితులు నేరాన్ని అంగీకరించారు. వీరు ఈ నెల ఆఖ‌రి నుంచి శిక్షా విచారణను ఎదుర్కోవలసి ఉంటుంది. 13 వ నిందితుడు వచ్చే ఏడాది మార్చిలో విచారణకు రానున్నట్లు మెట్ తెలిపింది.


logo