శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Jul 20, 2020 , 01:44:26

లఢక్‌లో రాఫెల్‌ ఫైటర్స్‌!

లఢక్‌లో రాఫెల్‌ ఫైటర్స్‌!

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌నుంచి కొనుగోలుచేసిన అత్యాధునికి రాఫెల్‌ యుద్ధ విమానాలను లఢక్‌ సెక్టార్‌లో మోహరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 22నుంచి 24వరకు జరుగనున్న భారత వాయుసేన కమాండర్ల సదస్సులో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. రాఫెల్‌ విమానాల సరఫరాను వేగవంతం చేయాలని ఇప్పటికే భారత ప్రభుత్వం ఫ్రాన్స్‌ను కోరింది. ఈ నెల 27న అంబాలా ఎయిర్‌ బేస్‌కు ఆరు రాఫెల్‌ ఫైటర్స్‌ రానున్నాయి. ఈ విమానాలను నడిపేందుకు భారత పైలట్లకు ఫ్రాన్స్‌లో ఏడాదికాలంగా శిక్షణ ఇస్తున్నారు.


logo