గురువారం 28 మే 2020
International - Apr 20, 2020 , 17:33:34

పాకిస్తాన్‌లో నిబంధ‌న‌ల‌తో రంజాన్ ప్రార్థ‌న‌లు

పాకిస్తాన్‌లో నిబంధ‌న‌ల‌తో రంజాన్ ప్రార్థ‌న‌లు

రంజాన్ ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో మ‌సీదుల్లో సామూహిక ప్రార్థ‌న‌ల‌కు పాకిస్తాన్ సూత్రప్రాయంగా అంగీక‌రించింది. మొద‌ట‌గా సామూహిక ప్రార్థ‌న‌ల‌కు అంగీక‌రించ‌ని పాక్ ప్ర‌భుత్వం.. ఇస్లాం మ‌త సంస్థ‌ల నుంచి వ‌చ్చిన ఒత్తిడికి త‌లోగ్గింది. అయితే ఇందుకు కొన్ని నిబంధ‌న‌ల‌ను విధిస్తున్న‌ట్లు పేర్కొంది. ఇందులో 50 ఏళ్ళ వయసు పైబడినవారు, పిల్లలు, జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం  లక్షణాలు ఉన్న వారిని మసీదులకు అనుమతించకూడదనే విషయంలో మత పెద్దలు ప్రభుత్వ ప్రతిపాదనతో అంగీకరించారు.

మసీదుల నుంచి కార్పెట్లను తొలగించడం, నమాజు చేసే ప్రాంతాలను ప్రతిరోజూ శుభ్రం చేయడం, వ్యక్తుల మధ్య తగిన దూరం ఉండేలా చూడడం వంటి నియమాలను పాటించడం జరుగుతుందని మత పెద్దలు తెలిపారు.  అలాగే, కరచాలనాలు, ఆలింగనాలపై ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. అయితే ఇప్ప‌టికే పాకిస్తాన్‌లో ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను బేఖాత‌రు చేస్తున్న‌ట్లు అక్క‌డి మీడియా పేర్కొంది. నిబంధ‌న‌లు ఎంత‌మేర పాటిస్తార‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా  మారింది. అయితే కొందరు లాక్‌డౌన్ విధించాల‌ని కోరుతున్నారు.


logo