మంగళవారం 26 మే 2020
International - Apr 18, 2020 , 12:16:23

ఇంట్లోనే రంజాన్‌ ప్రార్థనలు: సౌదీ మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ

ఇంట్లోనే రంజాన్‌ ప్రార్థనలు: సౌదీ మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ

రియాద్: రంజాన్ మాసం వ‌చ్చే వారం ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఇఫ్తార్, తారావీహ్‌ కార్యక్రమాలను అందరూ ఇంట్లోనే నిర్వహించుకోవాలని సౌదీ అరేబియా మతపెద్ద గ్రాండ్‌ ముఫ్తీ షేక్‌ అబ్దులాజీజ్‌ అల్ షేక్‌ పిలుపునిచ్చారు. క‌రోనా విజృంభిస్తున్న త‌రుణంలో ప‌లు సూచ‌న‌లు చేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితులు మ‌సీదుల‌కు వెళ్లేందుకు అనువుగా లేవ‌ని పేర్కొన్నారు. అంద‌రూ కూడా ఇళ్ల‌లోనే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకోవాల‌న్నారు. ఇస్లాంను విశ్వసించేవారంతా ఈ నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అటు  రంజాన్ సంద‌ర్బంగా మదీనాలోని ప్రముఖ మసీదులో ప్రతిరోజు ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ను సైతం రద్దు చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. ఎవ్వ‌రు కూడా మసీదుకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచించింది. కాగా సౌదీలో ఇప్పటి వరకు 7,142 కేసులు న‌మోదు కాగా... 87 మంది మృత్యువాతపడ్డారు.


logo