సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Sep 04, 2020 , 22:19:22

భార‌త్‌, చైనా ర‌క్ష‌ణ‌మంత్రుల స‌మావేశం

భార‌త్‌, చైనా ర‌క్ష‌ణ‌మంత్రుల స‌మావేశం

మాస్కో : భార‌త్‌, చైనా ర‌క్ష‌ణ‌శాఖ మంత్రులు ఇరువురు ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో శుక్ర‌వారం స‌మావేశ‌మ‌య్యారు. భార‌త ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. చైనా ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి వీ ఫెన్‌గీ ఇరువురు స‌మావేశమ‌య్యారు. మాస్కోలో జ‌రుగుతున్న‌ షాంఘై కోఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్‌(ఎస్‌సీవో) స‌మావేశంలో పాల్గొనేందుకు ఇరు దేశాల ర‌క్ష‌ణ‌శాఖ మంత్రులు వెళ్లారు. చైనా రక్షణ మంత్రి ఈ సమావేశం కోసం కోరినట్లుగా స‌మాచారం. భార‌త్‌, చైనా మ‌ధ్య లడ‌ఖ్ స‌రిహ‌ద్దు అంశం తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. ప‌లుమార్లు రెండు దేశాల సైనికులు.. వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద ఘ‌ర్ష‌ణ‌కు కూడా దిగారు.

దీంతో ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేందుకు.. రెండు దేశాలు సైనిక‌, దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్చ‌లు కూడా చేప‌ట్టాయి. ఈ నేప‌థ్యంలోనే ఇవాళ చైనా ర‌క్ష‌ణ మంత్రి వీ ఫెన్‌గీ భార‌త‌ ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో స‌మావేశ‌మ‌య్యారు.  వాస్తవాధీన రేఖ వ‌ద్ద మే నెల నుంచి ఉద్రిక‌త్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇవి ఇలాగే కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇరు దేశాల‌ ర‌క్ష‌ణ మంత్రులు క‌లుసుకోవ‌డం ఇదే మొద‌టిసారి. రాజ‌కీయంగా కూడా ఈ భేటీ కీల‌కం కానున్న‌ది.

 


logo