బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Jan 21, 2020 , 22:35:34

అదృశ్యమైన వారంతా మరణించారు: గోటబయ రాజపక్స

అదృశ్యమైన వారంతా మరణించారు: గోటబయ రాజపక్స

దశాబ్దాలుగా జరిగిన అంతర్యుద్ధంలో అదృశ్యమైన వారంతా మరణించారని శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స తెలిపారు. లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం (ఎల్టీటీఈ)తో జరిగిన పోరులో కనిపించకుండా పోయిన 20 వేల మంది ప్రజలు చనిపోయారని ఎట్టకేలకు ఆయన అంగీకరించారు. దీనిపై దర్యాప్తు ముగిసిన అనంతరం అదృశ్యమైన వారి మరణ ధ్రువీకరణ పత్రాలను సంబంధిత కుటుంబాలకు అందజేస్తామన్నారు. ‘బాధిత కుటుంబాలు సాధారణ జీవితం గడిపేందుకు సహకరిస్తాం. తమ ఎజెండా దెబ్బతింటుందన్న కారణంతో తమిళ రాజకీయ నేతలు దీనిని తప్పక

కొలంబో : దశాబ్దాలుగా జరిగిన అంతర్యుద్ధంలో అదృశ్యమైన వారంతా మరణించారని శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స తెలిపారు. లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం (ఎల్టీటీఈ)తో జరిగిన పోరులో కనిపించకుండా పోయిన 20 వేల మంది ప్రజలు చనిపోయారని ఎట్టకేలకు ఆయన అంగీకరించారు. దీనిపై దర్యాప్తు ముగిసిన అనంతరం అదృశ్యమైన వారి మరణ ధ్రువీకరణ పత్రాలను సంబంధిత కుటుంబాలకు అందజేస్తామన్నారు. ‘బాధిత కుటుంబాలు సాధారణ జీవితం గడిపేందుకు సహకరిస్తాం. తమ ఎజెండా దెబ్బతింటుందన్న కారణంతో తమిళ రాజకీయ నేతలు దీనిని తప్పక వ్యతిరేకిస్తారు. అయినప్పటికీ మేం చేపట్టబోయే చర్య బాధిత కుటుంబాలకు ఎంతో సహాయపడుతుంది’ అని అధ్యక్ష కార్యాలయం తెలిపిందని కొలంబో గెజిట్‌ పేర్కొంది. గతంలో రక్షణ మంత్రిగా  ఉన్న రాజపక్స గతవారం ఐరాస సమన్వయకర్త హన్నా సింగర్‌కు ఈ మేరకు వెల్లడించారని తెలిపింది. 


శ్రీలంక సైన్యం, ఎల్టీటీఈ మధ్య సుమారు 30 ఏండ్లపాటు జరిగిన అంతర్యుద్ధంలో దాదాపు లక్ష మంది మరణించగా, 20 వేల మంది ప్రజలు అదృశ్యమయ్యారని ఆ దేశ ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తున్నది. 2009లో ఎల్టీటీఈ అధిపతి ప్రభాకరన్‌ను చంపిన అనంతరం వేలాది మంది తమిళులను సైన్యం ఊచకోత కోసిందని శ్రీలంకలోని తమిళ సంఘాలు ఆరోపించగా ప్రభుత్వం ఖండించింది. కాగా సైన్యం, ఎల్టీటీఈ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని అంతర్యుద్ధం అనంతరం ఐరాస మండిపడింది. తుది పోరులో సుమారు 40 వేల మంది తమిళ పౌరులు మరణించి ఉంటారని అంతర్జాతీయ మానవ హక్కుల బృందాలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో యుద్ధ నేరాల ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని శ్రీలంకపై ఒత్తిడి తెచ్చాయి. అయితే ఇది తమ అంతర్గత సమస్య అని, ఆరోపణలపై తామే దర్యాప్తు జరుపుతామన్న శ్రీలంక ప్రభుత్వం, ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది. logo