సోమవారం 06 జూలై 2020
International - Jun 04, 2020 , 01:46:01

75 మంది నిరసనకారులకు ఆశ్రయం

75 మంది నిరసనకారులకు ఆశ్రయం

రాహుల్‌ దూబే.. రియల్‌ హీరో

వాషింగ్టన్‌ డీసీలో నివాసం ఉంటున్న భారత సంతతి వ్యక్తి రాహుల్‌ దూబే ఇప్పుడు అమెరికాలో ‘హీరో’ అయ్యారు. ఫ్లాయిడ్‌ హత్య నేపథ్యంలో సోమవారం రాత్రి నిరసనకారులు రోడ్ల మీదికి రాగా పోలీసులు టియర్‌ గ్యాస్‌, పెప్పర్‌ స్ప్రే ప్రయోగించారు. దీంతో చాలా మంది రోడ్లమీదే బాధతో విలవిలలాడారు. పోలీసులు అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించగా తలోదిక్కు పారిపోయారు. అలాంటివారిలో దాదాపు 75 మందికి రాహుల్‌ తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చారు. దీంతో నెటిజన్లు ఆయనను రియల్‌ హీరోగా అభివర్ణిస్తున్నారు. ఫ్లాయిడ్‌ హత్య పట్ల భారత సంతతికి చెందిన ఎంపీ అమి బెరా విచారం వ్యక్తం చేశారు. అమెరికాలో అసమానతలు, జాతివివక్షపై చర్చ జరుగాలని, చట్టాలను మార్చాల్సి ఉన్నదని అభిప్రాయపడ్డారు.


logo