శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 07, 2020 , 20:23:10

జమైకాలో భారత హైకమిషనర్‌గా మసకుయ్ నియామకం

జమైకాలో భారత హైకమిషనర్‌గా మసకుయ్ నియామకం

న్యూ ఢిల్లీ : జమైకాకు భారత తదుపరి హైకమిషనర్‌గా డిప్లొమాట్ ఆర్ మసకుయ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రిపబ్లిక్ ఆఫ్‌ జింబాబ్వేకు రాయబారిగా ఉన్నారు. ఆయన త్వరలోనే జమైకా హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఆదివారం ప్రకటనలో తెలిపింది. మసకుయ్‌ 1999 నుంచి 2001 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశాడు. అనంతరం విదేశాంగ సేవలో చేరిన ఆయన ఇండోనేషియాలోని జకార్తాలోని మూడో/ రెండవ కార్యదర్శిగా సేవలందించారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ కాన్సుల్‌గా, బంగ్లాదేశ్‌లోని ఢాకాలో కౌన్సిలర్‌గా పనిచేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్‌గానూ మసకుయ్‌ పనిచేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo