మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 28, 2020 , 16:30:10

బొమ్మ అంబులెన్స్‌తో అమ్మ ప్రాణం కాపాడాడు..!

బొమ్మ అంబులెన్స్‌తో అమ్మ ప్రాణం కాపాడాడు..!

టెల్ఫోర్డ్: బొమ్మ అంబులెన్స్‌తో ఆడుకుంటున్న ఓ ఐదేళ్ల బాలుడు తన అమ్మ ప్రాణం కాపాడాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? అవును ఇది నిజం. ఉన్నట్టుండి తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడే ఆడుకుంటున్న ఆమె ఐదేళ్ల కొడుకు అందరిలా ఏడుస్తూ ఉండిపోలేదు. తను ఆడుకుంటున్నబొమ్మ అంబులెన్స్‌పై ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేశాడు. వెంటనే వైద్య సిబ్బంది వచ్చి ఆమెకు చికిత్స చేశారు. బాలుడి శీఘ్ర ఆలోచన తల్లి ప్రాణాలను కాపాడింది. 

ఈ సంఘటన యూకేలోని ష్రాప్‌షైర్‌లోని టెల్ఫోర్డ్‌లో జరిగింది. తల్లి కరోలిన్ కుప్పకూలినప్పుడు జోష్ చాప్మన్ తన తమ్ముడు హ్యారీతో ఆడుకుంటున్నాడు. ఇంతకు ముందు ఫోన్ ఉపయోగించని జోష్, తన యూరోపియన్-మోడల్ బొమ్మ అంబులెన్స్‌లో సంఖ్యను గుర్తించిన తర్వాత సహాయం కోసం 112 డయల్ చేయగలిగాడు. 112 సంఖ్య యురోపియన్ ఎమర్జెన్సీ నంబర్‌. పోలీసు ఆపరేటర్‌తో అనుసంధానించింది. తన తల్లి పడిపోయిందని బాలుడు పోలీస్‌ అధికారికి తెలుపగా, అతడు వైద్య సిబ్బందిని లొకేషన్‌కు తీసుకొని వచ్చాడు. ఆమెకు చికిత్స చేయగా, కోలుకుంది. తన కొడుకు ఎప్పుడూ ఫోన్‌ వాడలేదని, కానీ తాను పడిపోగానే బొమ్మ అంబులెన్స్‌పై ఉన్న నంబర్‌కు డయల్‌ చేశాడని, ఇది తాను నమ్మలేకపోతున్నానని తల్లి పేర్కొంది. అసలు అక్కడ ఎమర్జెన్సీ నంబర్‌ ఉందని తనకు కూడా తెలియదన్నారు. కాగా, జోష్‌ తెలివితేటలకు ముగ్దులైన పోలీసులు అతడిని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పర్యటించేందుకు ఆహ్వానించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo