సోమవారం 30 మార్చి 2020
International - Mar 16, 2020 , 02:10:39

ప్యాలెస్‌ను వీడిన బ్రిటన్‌ రాణి

ప్యాలెస్‌ను వీడిన బ్రిటన్‌ రాణి

లండన్‌: కరోనా నేపథ్యంలో బ్రిటన్‌ రాణి ఎలిజిబెత్‌-2 (93) తన రాజభవనం ‘బకింగ్‌హాం ప్యాలెస్‌'ను వీడారు. ఆమెను లండన్‌లోని రాజ భవనానికి దూరంగా ఉన్న విండ్సర్‌ కేజిల్‌(విండ్సర్‌ కోట)కి అధికారులు తీసుకెళ్లారు. బ్రిటన్‌లో కరోనా మృతుల సంఖ్య 21కి చేరింది. ప్రస్తుతం రాణి ఆరోగ్యంగా ఉన్నారని.. ముందు జాగ్రత్త చర్యగా ఆమెను వేరే ప్రదేశానికి తరలించినట్టు ప్యాలెస్‌ వర్గాలు తెలిపాయి. వచ్చేనెలలో ఎలిజిబెత్‌-2.. 94వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. కాగా, కరోనా వల్ల ఆ వేడుకలు రద్దు కావొచ్చని భావిస్తు న్నారు. మరోవైపు, కరోనాతో ఈ ఏడాది ఈస్టర్‌ వేడుకల్లో ప్రజల్ని అనుమతించ బోమని వాటికన్‌ ఆదివారం  ఓ ప్రకటనలో పేర్కొంది. 


logo