శనివారం 16 జనవరి 2021
International - Jan 10, 2021 , 13:40:47

టీకాలు వేయించుకున్న బ్రిట‌న్ రాణి దంప‌తులు

టీకాలు వేయించుకున్న బ్రిట‌న్ రాణి దంప‌తులు

లండ‌న్: బ్రిటన్‌ రాణి ఎలిజిబెత్ (94)‌, ఆమె భ‌ర్త ప్రిన్స్ ఫిలిప్ (99) దంప‌తులు కరోనా టీకాలు వేయించుకున్నారు. రాణి దంప‌తులు ఇద్ద‌రికీ కొవిడ్ టీకాలు వేసిన‌ట్లు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ప్రకటించింది. వారికి ఫ్యామిలీ డాక్టర్‌ విండ్‌సోర్‌ టీకాలు వేశారు. కాగా, రాణి దంప‌తులు లాక్‌డౌన్‌ సమయాన్ని పూర్తిగా బ‌కింగ్ హామ్ ప్యాలెస్‌లోనే గడిపారు. మార్చి నుంచి అక్టోబర్‌ వరకు వారు ప్యాలెస్ వ‌దిలి బ‌య‌ట‌కు వెళ్ల‌లేదు. 

కానీ, లాక్‌డౌన్‌ సమయంలో బ్రిట‌న్ రాణి దంప‌తుల‌ పెద్ద కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ కొవిడ్‌ బారినపడ్డారు. మనవడు విలియమ్స్‌కు కూడా ఏప్రిల్‌లో కొవిడ్‌ పాజిటివ్ వ‌చ్చింది. కాగా, రాణి దంప‌తులు బెర్క్‌షైర్‌ రెసిడెన్సీలో క్రిస్మ‌స్ వేడుక‌లు జరుపుకున్నారు. కరోనా వ్యాప్తి తర్వాత తొలిసారి గ‌త‌ నెలలో రాయల్‌ ఫ్యామిలీ సినియర్‌ సభ్యులతో రాణి భేటీ అయ్యారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.