మంగళవారం 31 మార్చి 2020
International - Mar 15, 2020 , 16:45:14

ప్యాలెస్‌ నుంచి క్వీన్‌ ఎలిజబెత్‌-2 తరలింపు

ప్యాలెస్‌ నుంచి క్వీన్‌ ఎలిజబెత్‌-2 తరలింపు

లండన్‌: యూకేలో కరోనా వైరస్‌ ప్రభావంతో క్వీన్‌ఎలిజబెత్‌ -2ను లండన్‌లోని బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ నుంచి వింద్‌సార్‌ కాస్టిల్‌కు తరలించారు. బ్రిటన్‌లో కోవిడ్‌-19 ధాటికి మృతుల సంఖ్య 21కి చేరుకుంది. రానున్న కాలంలో కరోనా వ్యాప్తికి అవకాశాలు కన్పిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ అధికార యంత్రాంగం క్వీన్‌ ఎలిజబెత్‌-2తోపాటు ఆమె భర్త ప్రిన్ష్‌ పిలిప్‌ వింద్‌సార్‌ కాస్టిల్‌కు తీసుకెళ్లారు. నొర్‌ఫోక్‌లోని రాయల్‌ సాండ్రింఠఘామ్‌ ఎస్టేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంచనున్నట్లు తెలుస్తోంది. యూకేలో ఇప్పటివరకు వెయ్యి మందికిపై కరోనా అనుమానిత లక్షణాలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

బ్రిటన్ వైద్యఆరోగ్య శాఖ మంత్రి నాడిన్ డోరీస్‌కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలగా.. వైద్యుల సలహా మేరకు ఆమె ఇంట్లోనే ఐసోలేషన్ గదిలో ఉంటున్న విషయం తెలిసిందే. logo
>>>>>>