శనివారం 30 మే 2020
International - Apr 09, 2020 , 12:44:31

క్వారంటైన్ పిల్లో ఛాలెంజ్‌..ఫొటోలు వైర‌ల్

క్వారంటైన్ పిల్లో ఛాలెంజ్‌..ఫొటోలు వైర‌ల్

క‌రోనా వైర‌స్ పై యుద్దం చేసేందుకు ప్ర‌పంచ‌దేశాలు ఇపుడు లాక్‌డౌన్ పాటిస్తోన్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా హోం క్వారంటైన్ అయిపోయారు. క్వారంటైన్ టైంలో కొత్త కొత్త ఛాలెంజ్ విసురుతూ..నెటిజ‌న్ల‌కు కాస్త వినోదాన్ని అందిస్తున్నారు. తాజాగా క్వారంటైన్ పిల్లో ఛాలెంజ్ ఒక‌టి నెట్టింట్లో ట్రెండింగ్ లో ఉంది. ఇంత‌కీ క్వారంటైన్ ఫిల్లో ఛాలెంజ్ ఏంట‌నుకుంటున్నారా..?

ప‌డుకునేట‌పుడు త‌ల కింద పెట్టుకునే దిండు (పిల్లో)ను డ్రెస్ గా వేసుకోవ‌డ‌మ‌న్న‌మాట‌. కొంత‌మంది అమ్మాయిలు దిండును డ్రెస్ గా వేసుకుని..దానికి బెల్ట్ బిగించి..ఆ కాస్ట్యూమ్స్ లో ఫొటోలు, సెల్ఫీలు దిగుతున్నారు. ఆ స్టిల్స్‌ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయ‌డంతో అవి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo