శనివారం 06 జూన్ 2020
International - May 06, 2020 , 07:37:31

భారీగా ఉద్యోగుల‌ను త‌గ్గించుకుంటున్నాం: ఖ‌తార్ ఎయిర్‌వేస్

భారీగా ఉద్యోగుల‌ను త‌గ్గించుకుంటున్నాం: ఖ‌తార్ ఎయిర్‌వేస్

దోహా: క‌రోనావైర‌స్ కార‌ణంగా విమాన‌ప్ర‌యాణాల డిమాండ్ త‌గ్గిన నేప‌థ్యంలో ఉద్యోగాల‌ను భారీగా త‌గ్గించుకుంటున్న‌ట్లు ఖ‌తార్ ఎయిర్‌వేస్ ప్ర‌క‌టించింది. మార్చి నాటికి 234 విమానాల‌తో 170 గ‌మ్య‌స్థానాల‌కు ప్ర‌యాణికుల‌ను చేరవేసేవార‌మ‌ని పేర్కొంది. కోవిడ్‌-19 నేప‌థ్యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులు మూసివేయ‌డంతో చాలా న‌ష్టాలు చ‌విచూశామ‌ని వెల్ల‌డించింది. మిడిల్ ఈస్ట్‌, నార్త్ ఆఫ్రికాలో ఈ ఏడాది వాయు ర‌వాణా స‌గానికి పైగా త‌గ్గిపోతుంద‌ని అంత‌ర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేష‌న్ హెచ్చ‌రించింది. దీనిపై ఖ‌తార్ ఎయిర్‌వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అబ్క‌ర్ అల్ బేక‌ర్ మాట్లాడుతూ... ప్ర‌స్తుత ప‌రిస్థితిలో మేము ఉద్యోగుల‌ను నిల‌బెట్టుకోలేక‌పోతున్నందుకు బాధ‌గా ఉంది.

క్యాబిన్ సిబ్బందితో స‌హా ఇత‌ర ఉద్యోగుల‌ను త‌గ్గించుకుంటున్నామ‌ని, ఇప్ప‌టికే వారంద‌రికీ నోటీసులు కూడా ఇచ్చామ‌ని పేర్కొన్నారు. సుమారు 30వేల మంది సిబ్బందిపై ఈ ప్ర‌భావం పడే అవ‌కాశం ఉంది. క‌రోనా విమాన‌యాన ప‌రిశ్ర‌మ‌పై పెద్ద ఎదురు దెబ్బ‌గా ప‌రిగ‌ణిస్తున్నాం. వ్యాపారం భ‌విష్య‌త్‌ను నిలుపుకోవ‌డానికి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఎయిర్‌లైన్స్ ప్ర‌క‌టించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిని సంస్థ మెరుగుప‌డిన అనంత‌రం అవ‌కాశాన్ని బ‌ట్టి మ‌ళ్లీ విధుల్లోకి తీసుకుంటామ‌ని వెల్ల‌డించింది. 


logo