మాస్కో: రష్యాలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అక్టోబర్ 30 నుంచి వారం రోజులు పెయిడ్ హాలిడేను ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ బుధవారం ప్రకటించారు. టీకా వేసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని ఆయన కోరారు.
రష్యాలో గత కొన్ని రోజులుగా నిత్యం వెయ్యికిపైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్ ఆ దేశ అధికారులతో బుధవారం వీడియో సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7 వరకు చెల్లింపు సెలవుగా ప్రకటించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు తెలిపారు. రష్యన్లు బాధ్యతగా వ్యవహరించి టీకాలు పొందాలని సూచించారు.