శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Aug 21, 2020 , 01:01:54

పుతిన్‌ ప్రత్యర్థిపై విషప్రయోగం!

పుతిన్‌ ప్రత్యర్థిపై విషప్రయోగం!

  • కోమాలో రష్యా విపక్షనేత అలెక్సీ నావల్నీ

మాస్కో, ఆగస్టు 20: రష్యా ప్రతిపక్ష నాయకుడు, అతినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అలెక్సీ నావల్నీ అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనపై విషప్రయోగం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు నావల్నీ గట్టి ప్రత్యర్థిగా గుర్తింపు పొందారు. సైబీరియాలోని టోమ్స్‌ నగరం నుంచి మాస్కోకు గురువారం విమానంలో వస్తుండగా ఆయన ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో విమానాన్ని ఓమ్స్‌ పట్టణంలో అత్యవసరంగా దింపి ఆయనను దవాఖానకు తరలించారు. నావల్నీ విమానం ఎక్కేముందు ఎయిర్‌పోర్టులో టీ తాగారని, అందులోనే అనునామాస్పద విషపదార్థం కలిసి ఉంటుందని నావల్నీ ప్రతినిధి కిరా యార్మిష్‌ తెలిపారు. గతంలో నావల్నీపై భౌతికదాడులు కూడాజరిగాయి.


logo