సోమవారం 30 నవంబర్ 2020
International - Nov 07, 2020 , 02:29:23

పుతిన్‌కు పార్కిన్సన్‌!

పుతిన్‌కు పార్కిన్సన్‌!

  • పదవి నుంచి తప్పుకోవాలని కుటుంబం ఒత్తిడి

మాస్కో: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాధినేతల్లో ఒకరిగా పేరుగాంచిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పార్కిన్సన్‌ వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని కుటుంబం నుంచి ఆయనపై ఒత్తిడి పెరిగిందని మాస్కోకు చెందిన రాజకీయ నిపుణులు వలెరీ సోలోవీని ఉటంకిస్తూ బ్రిటన్‌కు చెందిన ‘డెయిలీమెయిల్‌' కథనం ప్రచురించింది. పుతిన్‌కు పార్కిన్సన్‌ ఉండొచ్చని, ఇటీవల ఆయనలో ఆ వ్యాధి లక్షణాలు కనిపించాయని సోలోవీ పేర్కొన్నారు. (పుతిన్‌ కాళ్లు వణకటం, పెన్ను పట్టి సరిగా రాయలేకపోవడం ఇటీవలి వీడియోల్లో కనిపించాయి). ఈ వార్తలను రష్యా ఖండించింది. పుతిన్‌ ఆరోగ్యంగానే ఉన్నారని రష్యా ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.