బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 03, 2020 , 01:31:08

2036 దాకా రష్యాకు పుతినే అధ్యక్షుడు

2036 దాకా రష్యాకు పుతినే అధ్యక్షుడు

  • రాజ్యాంగ సవరణకు భారీగా ప్రజామోదం

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ 2036 దాకా పదవిలో కొనసాగనున్నారు. అందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణకు దేశవ్యాప్తంగా 78% మంది ఓటర్లు మద్దతిచ్చారు. పుతిన్‌ పదవీకాలం 2024తో ముగియనుంది. దీనిని పొడిగించడానికి వీలు కల్పించే రాజ్యాంగ సవరణపై వారం రోజులు ప్రజాభిప్రాయ సేకరణ(ప్లెబిసైట్‌) నిర్వహించారు. ప్లెబిసైట్‌లో దేశవ్యాప్తంగా 64% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 78శాతం మంది పుతిన్‌ మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టడానికి సుముఖత వ్యక్తంచేశారు. అయితే ప్రతిపక్షాలు దీనిని కొట్టిపారేశాయి. పుతిన్‌కు ప్రజామోదం లేదని, ఓటింగ్‌లో పారదర్శకత లోపించిందని ఆరోపించాయి. ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ, పుతిన్‌తో గురువారం ద్వైపాక్షిక సంబంధాలపై ఫోన్లో చర్చించారు. ఈ ఏడాది చివర్లో ద్వైపాక్షిక సదస్సుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. రష్యా రాజ్యాంగ సవరణకు ప్రజామోదం లభించిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు.

తాజావార్తలు


logo