బుధవారం 03 మార్చి 2021
International - Feb 23, 2021 , 16:11:20

స్కీయింగ్ చేసిన ర‌ష్యా, బెలార‌స్ అధ్య‌క్షులు

స్కీయింగ్ చేసిన ర‌ష్యా, బెలార‌స్ అధ్య‌క్షులు

సోచి :  ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌, బెలార‌స్ అధ్య‌క్షుడు అలెగ్జాండ‌ర్ లుక‌షెంకోలు మంచుశిఖ‌రాల‌పై స్కీయింగ్ చేశారు.  సోచి న‌గ‌రంలో జ‌రిగిన స‌మావేశంలో పాల్గొన్న ఇద్ద‌రూ ప‌లు అంశాల‌పై చ‌ర్చించుకున్నారు. ఆ త‌ర్వాత అక్క‌డ ఉన్న ఫేమ‌స్ క్రాస్‌న‌యా పోల్‌యానా మంచుకొండ‌ల‌పై స్కీయింగ్ చేశారు.  గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో 1.5 బిలియ‌న్ల డాల‌ర్ల నిధిని బెలార‌స్‌కు ర‌ష్యా అందించింది. దీని ప‌ట్ల లుక‌షెంకో.. ర‌ష్యా అధ్య‌క్షుడికి థ్యాంక్స్ చెప్పారు.  ఇద్ద‌రు నేత‌లు దాదాపు గంట సేపు వివిధ అంశాల‌పై మాట్లాడుకున్నారు.  స్కీయింగ్ చేసిన వాళ్లు.. డిన్న‌ర్‌కు వెళ్లారు.   


VIDEOS

logo