సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 02, 2020 , 23:24:03

ఓ భార్య.. ఓ భర్త.. ఓ కుక్క..!: ఫొటో వైరల్‌

ఓ భార్య.. ఓ భర్త.. ఓ కుక్క..!: ఫొటో వైరల్‌

హైదరాబాద్‌: వివాహానికి ముందు, తర్వాత ఫొటోషూట్‌ ఇప్పుడు కామన్‌ అయిపోయింది. వివిధ రకాల ఫోజుల్లో ఆ జంటకు కలకాలం గుర్తిండిపోయేలా ఫొటోలు తీస్తున్నారు. అయితే, ఫొటోషూట్‌ సందర్భంగా ఓ అరుదైన సంఘటన ఓ జంటకు ఎదురైంది.

షాన్‌ అనే మహిళ ట్విట్టర్‌లో ఓ ఫొటో పెట్టింది. ఈ ఫొటోలో ఆమె భర్త, ఆమె చేతికి ఉన్న ఉంగరాలను చూయిస్తున్నారు. అచ్చు వాళ్లలాగే వారి పెంపుడు కుక్క కూడా కాలు పెట్టింది. ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. మైక్రోబ్లాగింగ్ సైట్‌లో 36,800 రీట్వీట్లు, 3,02,100 లైక్‌లను సంపాదించింది. చూసినవారంతా వావ్‌ అంటూ ఆశ్చర్యపోతున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo