NCP పార్లమెంటరీ నేతగా పుష్ప కమల్ దహల్

ఖాట్మండు: నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (NCP) పార్లమెంటరీ నాయకుడిగా పుష్ప కమల్ దహల్ (ప్రచండ) ఎన్నికయ్యారు. అంతర్గత విభేదాల కారణంగా నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవడంతో.. ప్రస్తుతం ఆ దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. మరోవైపు NCP అధ్యక్షుడు ప్రచండ ఓలిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో పార్టీ పార్లమెంటరీ నాయకుడి ఎన్నిక కోసం పుష్ప కమల్ దహల్, నేపాల్ ఫ్యాక్షన్ సమావేశమైంది.
బుధవారం మధ్యాహ్నం న్యూ బానేశ్వర్లోని పార్లమెంట్ బిల్డింగ్‌లో జరిగిన ఈ సమావేశంలో పుష్ప కమల్ దహల్‌ను ఏకగ్రీవంగా NCP పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నుకున్నారు. పార్టీ సీనియర్ నేత మాధవ్ కుమార్ నేపాల్ ప్రచండ పేరును ప్రతిపాదించగా మిగతా సభ్యులందరూ ఆయన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. అంతకుముందు మాధవ్ కుమార్ నేపాల్‌ను పార్టీ ఛైర్మన్‌గా నియమించారు. ఇక నుంచి ప్రచండతోపాటు మాధవ్‌కుమార్ కూడా పార్టీ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. అంటే ప్రచండ పార్లమెంటరీ నేతగా, పార్టీ ఛైర్మన్‌గా రెండు పదవుల్లో కొనసాగుతారు.
ఇవి కూడా చదవండి..
భారత దౌత్య అధికారికి పాక్ సమన్లు
ఇండియాలో అమెరికా భారీ పెట్టుబడులు
బోరిస్ జాన్సన్ ఇండియా టూర్ అనుమానమే!
బైడెన్ టీంలో మరో ఇద్దరు భారతీయులు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.