బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 16, 2020 , 15:45:07

ఇది అథ్లెటిక్‌ పిల్లి.. వీడియో వైరల్‌!

ఇది అథ్లెటిక్‌ పిల్లి.. వీడియో వైరల్‌!

ఇస్తాంబుల్‌: అక్కడ వంద మీటర్ల పరుగు పందెం నడుస్తోంది. అథ్లెట్లు వేగంగా పరుగెడుతున్నారు. లక్ష్యానికి చేరువయ్యారు. అప్పటిదాకా అక్కడే వేచి ఉన్న ఆ పిల్లి సరిగ్గా వాళ్లు చేరుకునే సమయానికే గీతపై అడ్డంగా పరుగెత్తింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

సెప్టెంబరు 13 న టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన బాల్కన్ యూ20 పురుషుల అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో చోటుచేసుకుందీ వింత సంఘటన. టర్కీ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఈ ఫుటేజ్‌ను సోషల్‌ మీడియాలో పెట్టింది. ఇందులో పిల్లి అథ్లెట్లకంటే ముందే లక్ష్యాన్ని చేరుకునేందుకు పోటీపడుతున్నట్లు ఉంది. ఈ అద్భుతమైన వీడియో భారీగా వైరల్ అయ్యింది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు. సరదా కామెంట్లు పెట్టారు. మరెందుకాలస్యం మీరూ చూసేయండి.. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo