శుక్రవారం 07 ఆగస్టు 2020
International - Jul 05, 2020 , 02:45:34

బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేత

బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేత

లండన్‌: కరోనా మహమ్మారిని నియంత్రించడానికి విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను బ్రిటన్‌ ప్రభుత్వం ‘సూపర్‌ సాటర్‌డే (జూలై4)’ నుంచి సడలించింది. శనివారం బ్రిటన్‌ వ్యాప్తంగా బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, సెలూన్లు తెరుచుకున్నాయి. వివాహాది శుభకార్యాలకు అనుమతిలిచ్చారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌, ఇతర మంత్రులు మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ప్రజలు తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి సురక్షితంగా బయటకు వెళ్లి గడపాలని కోరారు. అయితే కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలిగిపోలేదని, భౌతికదూరం, మాస్క్‌లు ధరించడం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ‘కరోనాతో ఒక తరం భయపడుతుందని నేను ఆందోళన చెందుతున్నా. ఆ తరాన్ని నష్టపోవాలని నేను కోరుకోవడం లేదు. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అటువంటి పరిస్థితి తలెత్తదు’ అని అభిప్రాయ పడ్డారు. 


logo