సోమవారం 01 జూన్ 2020
International - May 02, 2020 , 17:33:54

పాకిస్థాన్‌లో ఉద్య‌మ నేత‌ ఆరిఫ్ వ‌జీర్ హ‌త్య‌

పాకిస్థాన్‌లో ఉద్య‌మ నేత‌ ఆరిఫ్ వ‌జీర్ హ‌త్య‌

న్యూఢిల్లీ: ‌పాకిస్థాన్‌లో పా‌ష్తూన్ త‌హ‌ఫ‌జ్ మూవ్‌మెంట్ (పీటీఎమ్‌) నాయ‌కుడు ఆరిఫ్ వ‌జీర్ హ‌త్య‌కు గుర‌య్యారు. ఖైబ‌ర్ ప‌‌క్తుంఖ్వా రాష్ట్రం ద‌క్షిణ వ‌జీరిస్థాన్ జిల్లాలోని వ‌నా ప‌ట్ట‌ణానికి చెందిన ఆరిఫ్ వ‌జీర్‌ నెల రోజుల క్రిత‌మే జైలు నుంచి బెయిల్‌పై వ‌చ్చాడు. శుక్ర‌వారం రాత్రి త‌న ఇంటి స‌మీపంలో ఉండ‌గా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆయ‌న‌పై కాల్పులు జ‌రిపి పారిపోయారు. దీంతో అత‌ని మ‌హ్మ‌ద్ అలీ వ‌జీర్ వెంట‌నే స్థానిక ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. అక్క‌డి నుంచి ఇస్లామాబాద్‌కు త‌రలించారు. అక్క‌డ చికిత్స పొందుతూ శ‌నివారం ఉద‌యం ఆయ‌న మ‌ర‌ణించారు. కాగా, 2017లో కూడా వ‌జీర్‌తో గొడ‌వ‌ప‌డ్డ కొంద‌రు ఉగ్ర‌వాదులు అత‌ని కుంటుంబంలో ఏడుగురు వ్య‌క్తుల‌ను కాల్చిచంపారు.     

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo