గురువారం 02 జూలై 2020
International - May 24, 2020 , 18:47:19

హాంకాంగ్‌లో ఉధృతంగా ఆందోళ‌న‌లు

హాంకాంగ్‌లో ఉధృతంగా ఆందోళ‌న‌లు

హాంకాంగ్‌: బ‌ల‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఉన్న హాంకాంగ్ హ‌క్కుల‌ను హ‌రించేలా చైనా తీసుకొస్తున్న వివాదాస్పద జాతీయ భద్రతా చట్టంపై హాంకాంగ్‌లో ఆందోళ‌న‌లు మిన్నంటాయి. వివాదాస్ప‌ద చ‌ట్టానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనకారులు రోడ్డుపైకి రావడంతో వారిపై పోలీసులు బాష్పవాయువును, జల ఫిరంగుల‌ను ప్రయోగించారు. పలువురిని అరెస్ట్‌ చేశారు. 

వివాదాస్ప‌ద చ‌ట్టానికి వ్య‌తిరేకంగా వంద‌ల మంది నిర‌స‌న‌కారులు ఆదివారం నలుపురంగు దుస్తులు ధరించి రోడ్లపైకి వచ్చారు. కొత్త చ‌ట్టం చేసే ఆలోచ‌న‌లు మానుకోవాల‌ని, హాంకాంగ్‌ స్వేచ్ఛను హ‌రించ‌వ‌ద్ద‌ని నినదించారు. దీంతో పోలీసులు వారిని హెచ్చరిస్తూ ముందుగా నీలిరంగు జెండాలు చూపించారు. అప్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడంతో బాష్పవాయువును, జల ఫిరంగులు ప్రయోగించి చెదరగొట్టారు. 

వారిలో 120 మంది ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు. చట్ట విరుద్ధంగా ఒకేచోట గుమిగూడారన్న ఆరోపణలపై వారిపై కేసులు నమోదు చేశారు. తొలుత తమ సిబ్బందిపై ఆందోళ‌న‌కారులు రాళ్లు రువ్వారని, గుర్తుతెలియని ద్రావణాన్ని తమపై చ‌ల్లార‌ని, అందుకే తాము జోక్యం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. logo