ఆదివారం 05 జూలై 2020
International - May 31, 2020 , 15:39:34

అమెరికాలో ఆగ‌ని నిర‌స‌న‌లు.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో క‌ర్ఫ్యూ

అమెరికాలో ఆగ‌ని నిర‌స‌న‌లు.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో క‌ర్ఫ్యూ

న్యూయార్క్‌: మిన్నెసొటా రాష్ట్రం మిన్నెపోలీస్‌‌లో న‌ల్ల జాతీయుడైన‌ జార్జ్ ఫ్లాయిడ్ హ‌త్యతో అమెరికావ్యాప్తంగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు వ‌రుస‌గా ఐదోరోజు కూడా కొన‌సాగుతున్నాయి. శ‌నివారం రాత్రి కూడా ఆందోళ‌న‌కారులు పెద్ద ఎత్తున రోడ్ల‌పైకి వ‌చ్చి నిర‌స‌న‌ల‌కు దిగారు. సీటెల్‌ నుంచి న్యూయార్క్ దాకా ప్ర‌తి న‌గ‌రంలో వేల మంది న‌ల్ల‌జాతీయులు ఆందోళ‌న‌ల్లో పాల్గొంటున్నారు. ప‌లు ప్రాంతాల్లో దుకాణాలు, వాహ‌నాల‌కు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు టియ‌ర్ గ్యాస్, ర‌బ్బ‌ర్ బుల్లెట్లు ప్ర‌యోగిస్తూ ఆందోళ‌న‌కారులను చెద‌ర‌గొడుతున్నారు. 

ప‌రిస్థితి రోజురోజుకు శృతిమించి పోతుండ‌టంతో దేశంలోని అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో క‌ర్ఫ్యూ విధించారు. లాస్ ఏంజిల్స్‌, చికాగో, అట్లాంటా స‌హా మొత్తం 24 న‌గ‌రాల్లో క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఆయా న‌గ‌రాల్లో ప్ర‌జ‌లు రాత్రి స‌మయాల్లో ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావద్ద‌ని ఆదేశాలు జారీ చేశారు. ప‌రిస్థితులు ఇలాగే కొన‌సాగితే త్వ‌ర‌లోనే మ‌రికొన్ని న‌గ‌రాల్లో కూడా క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.    ‌  


logo