మంగళవారం 24 నవంబర్ 2020
International - Nov 05, 2020 , 13:21:23

అమెరికాలో కౌంటింగ్ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు

అమెరికాలో కౌంటింగ్ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్, బైడెన్ మ‌ధ్య ఫ‌లితం ఇంకా తేల‌క‌పోవ‌డంతో.. ఆ దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.  కౌంటింగ్‌ను ఆపేయాలంటూ ట్రంప్ పిలుపునివ్వ‌గా.. దాన్ని వ్య‌తిరేకిస్తూ బైడెన్ మ‌ద్ద‌తుదారులు ఆందోళ‌నలు నిర్వ‌హిస్తున్నారు.  ఎన్నిక‌ల కౌంటింగ్‌లో మోసం జ‌రుగుతోంద‌ని, త‌క్ష‌ణ‌మే కౌంటింగ్ నిలిపివేయాల‌ని ట్రంప్ పిలుపునిచ్చారు.  దీంతో ట్రంప్ అనుకూల వ‌ర్గీయులు.. పోలింగ్ బూత‌ల వ‌ద్ద భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు దిగారు. ఇక ట్రంప్‌కు వ్య‌తిరేకంగా కొన్ని న‌గ‌రాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతున్నాయి.  పోలైన అన్ని ఓట్ల‌ను లెక్కించాల‌ని బైడెన్ మ‌ద్ద‌తుదారులు నినాదాలు చేస్తున్నారు.  కొన్ని కీల‌క రాష్ట్రాల్లో పోస్ట‌ల్ బ్యాలెట్ కౌంటింగ్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఈ ప‌రిస్థితి త‌లెత్తింది.

ఓరేగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో ట్రంప్ వ్య‌తిరేక ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతున్నాయి. అయితే హింసాత్మ‌కంగా మార‌కుండే ఉండేందుకు జాతీయ గార్డుల‌ను రంగంలోకి దించారు. సిటీ సెంట‌ర్‌లో షాపుల‌పై దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది.  మిన్నియాపోలీస్‌లో నిర‌స‌న‌కారుల‌ను అరెస్టు చేశారు. కౌంటింగ్ ఆపేయాల‌ని చెప్పిన ట్రంప్‌కు వ్య‌తిరేకంగా వాళ్లు ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. న్యూయార్క్‌, ఫిల‌డెల్ఫియా, చికాగో న‌గ‌రాల్లోనూ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు హోరెత్తించాయి.  ఇక డెట్రాయిట్‌లో ట్రంప్ అనుకూల వ‌ర్గీయులు ఆందోళ‌న చేప‌ట్టారు. ఆరిజోనాలోని ఫినిక్స్ లో కూడా కౌంటింగ్ ఆపాలంటూ ప్ర‌ద‌ర్శన‌ నిర్వ‌హించారు.