e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home అంతర్జాతీయం గ్లోబల్‌ ఇంటర్నెట్‌లో కలకలం

గ్లోబల్‌ ఇంటర్నెట్‌లో కలకలం

గ్లోబల్‌ ఇంటర్నెట్‌లో కలకలం
  • వార్తా వెబ్‌సైట్లు క్రాష్‌
  • జాబితాలో న్యూయార్క్‌ టైవ్‌ బీబీసీ, ఫోర్బ్స్‌..
  • అనంతరం ఒక్కొక్కటిగా అందుబాటులోకి
  • సర్వర్‌లో సాంకేతిక సమస్యలేనన్న ‘ఫాస్ట్‌లీ’ సంస్థ

లండన్‌ జూన్‌ 8: ప్రపంచవ్యాప్తంగా పలు ప్రఖ్యాత వెబ్‌సైట్లు మంగళవారం కొంతసమయంపాటు క్రాష్‌ కావడంతో కలకలం రేగింది. అంతర్జాతీయ వార్తా సంస్థలు న్యూయార్క్‌ టైవ్‌ ది గార్డియన్‌, బ్లూవ్‌ుబర్గ్‌, ఫైనాన్షియల్‌ టైవ్‌ సీఎన్‌ఎన్‌, బీబీసీ న్యూస్‌, ఫోర్బ్స్‌తో పాటు బ్రిటన్‌ ప్రభుత్వానికి చెందిన గవ్‌.యూకే వెబ్‌సైట్‌, అమెజాన్‌, రెడిట్‌, కోరా, పే పాల్‌, హెచ్‌బీవో మ్యాక్స్‌, హూలూ వంటి వెబ్‌సైట్లు క్రాష్‌ అయిన జాబితాలో ఉన్నాయి. ఈ సైట్లు ఓపెన్‌ చేస్తుంటే ‘503 సర్వీస్‌ అన్‌అవైలెబుల్‌’ అనే ఎర్రర్‌ సందేశం కనిపించింది. అయితే, కొంత సమయం గడిచాక.. ఇవన్నీ ఒక్కొక్కటిగా అందుబాటులోకి వచ్చాయి. ఈ సంస్థలకు క్లౌడ్‌ సర్వీస్‌ సేవలను అందించే గ్లోబల్‌ వెబ్‌సైట్‌ హోస్టింగ్‌ సర్వీస్‌ ‘ఫాస్ట్‌లీ’ సంస్థ సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సేవల్లో అంతరాయం కలిగినట్టు సదరు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
‘503 సర్వీస్‌ ఎర్రర్‌’ అంటే?
వెబ్‌సైట్‌ అనేది కోడ్స్‌, పేజెస్‌తో మిళితమైన ఓ వేదిక. వెబ్‌సైట్‌ లేఅవుట్‌, వివరాలను కోడ్‌ రూపంలో రాసి వెబ్‌ సర్వర్‌కు లింక్‌ చేస్తారు. యూజర్లు వెబ్‌సైట్‌ డొమైన్‌ నేమ్‌ను ఎంటర్‌ చేయగానే.. ఆ లింక్‌ వెబ్‌ సర్వర్‌కు కనెక్ట్‌ అవుతుంది. యూజర్‌ రిక్వెస్ట్‌ను తీసుకున్న వెబ్‌ సర్వర్‌ పేజీని డిస్‌ప్లే చేస్తుంది. అయితే, వెబ్‌సర్వర్‌ నిర్వహణలో సమస్యలు తలెత్తినప్పుడు లేదా పరిమితికి మించి ఎక్కువ మంది వెబ్‌సైట్‌ను బ్రౌజ్‌ చేసినప్పుడు అధిక లోడ్‌ ఏర్పడి ‘503 సర్వీస్‌ ఎర్రర్‌’ వస్తుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గ్లోబల్‌ ఇంటర్నెట్‌లో కలకలం

ట్రెండింగ్‌

Advertisement