శనివారం 04 ఏప్రిల్ 2020
International - Mar 23, 2020 , 12:48:08

క‌రోనా వ‌దంతులు.. జైల్లో 23 మంది ఖైదీలు మృతి

క‌రోనా వ‌దంతులు.. జైల్లో 23 మంది ఖైదీలు మృతి

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ సోకింద‌న్న వ‌దంత‌లు రావ‌డంతో.. కొలంబియాలోని ఓ జైలులో అల్ల‌ర్లు చోటుచేసుకున్నాయి.  దీంతో ఆ జైలులో ఉంటున్న 23 మంది ఖైదీలు చ‌నిపోయారు.  రాజ‌ధాని బొగొటాలో కిక్కిరిసిపోయిన ఓ జైలులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.  ఈ సంఘ‌ట‌న‌తో ఆ ప్రాంతంలో వైర‌స్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.  బ‌య‌ట‌కు పారిపోవాల‌నుకున్న ఖైదీలు.. హింస‌కు దిగిన‌ట్లు ఓ మంత్రి తెలిపారు. జైలులో ప‌రిశుభ్ర‌త స‌రిగా లేద‌న్న వాద‌న‌ల‌ను ఆయ‌న కొట్టిపారేశారు. మ‌రో లాటిన్ దేశం చిలీలో వైర‌స్ క‌ర్ఫ్యూ విధించారు. రాత్రి ప‌ది నుంచి తెల్ల‌వారుజామున 5 గంట‌ల వ‌ర‌కు ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్దు అని ఆదేశాలు జారీ చేశారు.logo