మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Mar 30, 2020 , 17:27:35

స్వీయ నియంత్ర‌ణ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్రిన్స్ చార్లెస్‌

స్వీయ నియంత్ర‌ణ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్రిన్స్ చార్లెస్‌

హైద‌రాబాద్‌: ప్రిన్స్ చార్లెస్‌.. స్వీయ నియంత్ర‌ణ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.  క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్ తేల‌డంతో ఆయ‌న సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లారు. బ్రిట‌న్‌ ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కారం 71 ఏళ్ల ప్రిన్స్ చార్లెస్ ఏడు రోజుల పాటు ఐసోలేష‌న్‌లో ఉన్నారు.  చార్లెస్ భార్య‌కు వైర‌స్ ప‌రీక్ష‌లు చేశారు. కానీ ఆమెకు నెగ‌టివ్ వ‌చ్చింది. అయినా ఆమె సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతానికి ప్రిన్స్ చార్లెస్ ఆరోగ్యం బాగుంద‌ని ప్యాలెస్ అధికారులు చెప్పారు.