ఆదివారం 29 నవంబర్ 2020
International - Oct 29, 2020 , 02:35:33

యుద్ధరంగంలోకి ప్రధాని భార్య

యుద్ధరంగంలోకి ప్రధాని భార్య

దేశమేదైనా ప్రధాని భార్య అంటే.. అధికారం, దర్పం, సకల సౌకర్యాలు, గౌరవ మర్యాదలు ఇవే గుర్తుకువస్తాయి. కదనరంగంలో కత్తి దూసిన వీరవనితలను కేవలం చరిత్రలోనే చూస్తాం.. కానీ అర్మేనియా ప్రధాని నికోల్‌ భార్య అన్నా హాకోబ్యాన్‌ మాత్రం ఇందుకు అతీతం. అజర్‌బైజాన్‌తో యుద్ధం నేపథ్యంలో తన మాతృభూమిని రక్షించుకునేందుకు ఆమె యుద్ధ కళల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఆయుధాల వాడకంలో తర్ఫీదు పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. తనతో పాటు మరో 12 మంది మహిళలు శిక్షణ పొందుతున్నట్టు ఆమె ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. శిక్షణ అనంతరం మిగతా సైనికుల్లాగే ఆమె సరిహద్దుల్లో శత్రువులతో పోరాడనున్నారు. ‘మాతృభూమిని, ఆత్మగౌరవాన్ని ఎవరికీ తాకట్టు పెట్టం’ అని ఆమె అన్నారు.