బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 15, 2020 , 12:46:58

భారత ప్రజలకు నేపాల్‌ ప్రధాని శుభాకాంక్షలు

భారత ప్రజలకు నేపాల్‌ ప్రధాని శుభాకాంక్షలు

ఖాట్మండు : 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం దేశ ప్రధాని మోదీతోపాటు భారత ప్రజలకు నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ శుభదినం ప్రధాని మోదీకి, భారత ప్రజలకు శుభాకాంక్షలు. భారత్‌ సర్వ శ్రేయస్సుతో మరింత పురోగమించాలి’ అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత భూభాగంలోని మూడు ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ కొత్త మ్యాప్‌ రూపొందించిన తరువాత ఇరుదేశాల మధ్య సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి.

వివాదం తరువాత మొదటి స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో భారత ప్రధాని సందేశం ప్రాధాన్యత సంతరించుకుంది. నేపాల్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు చేయూతగా భారత-నేపాల్ ద్వైపాక్షిక దీక్ష కింద భారత ప్రభుత్వం సాయం అందిస్తోంది. విద్య, ఆరోగ్యం, రోడ్ల నిర్మాణం, తాగునీరు, పారిశుధ్యం, వృత్తి శిక్షణ, వైద్యం తదితర రంగాల్లో నేపాల్‌కు సాయం అందిస్తూ వస్తోంది. 2003 నుంచి 77 జిల్లాల్లో 798.7 కోట్లకు పైగా వెచ్చించి 422 హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లను (హెచ్‌ఐసీడీపీ) పూర్తి చేసిందని ఖాట్మండులోని భారత రాయబారి కార్యాలయం తెలిపింది. 


logo