శుక్రవారం 22 జనవరి 2021
International - Dec 23, 2020 , 02:07:15

ప్రధానికి ప్రతిష్ఠాత్మక అమెరికా అవార్డు

ప్రధానికి ప్రతిష్ఠాత్మక అమెరికా అవార్డు

వాషింగ్టన్‌: ప్రధాని మోదీకి అమెరికా ప్రతిష్ఠాత్మక అవార్డును అందజేసింది. అమెరికా సైన్యంలో అత్యున్నత పురస్కారమైన ‘లీజియన్‌ ఆఫ్‌ మెరిట్‌'ను మోదీ తరఫున అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధూ సోమవారం అందుకున్నారు. వైట్‌హౌస్‌లో  అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రియెన్‌ ఈ పురస్కారాన్ని అందజేశారు. భారత్‌-అమెరికా మధ్య సంబంధాల బలోపేతం కోసం కృషి చేసినందుకు ఈ పురస్కారాన్ని మోదీకి అందజేసినట్లు పేర్కొన్నారు. 


logo