ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 31, 2020 , 01:56:46

జాతివివక్షపై అంకుశం

జాతివివక్షపై అంకుశం

  • ఫ్రాన్స్‌ ఎంపీకి మద్దతుగా అధ్యక్షుడి ఉద్యమం

ప్యారిస్‌: ఫ్రాన్స్‌లో నల్లజాతి ఎంపీ డెనియెల్లీ ఒబోనోపై రైట్‌వింగ్‌ అనుకూల పత్రిక వాలూయర్‌ యాక్చువెల్లీస్‌ ప్రచురించి జాతి వివక్ష కథనంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రానే ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఒబోనో నల్లజాతి బానిస అంటూ ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దాంతో జాతివివక్షకు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆ కథనాన్ని మక్రాన్‌ తీవ్రంగా ఖండించారని అధ్యక్ష భవనం ప్రకటించింది. ప్రధాని జీన్‌ కాస్టెక్స్‌ కూడా పత్రిక వైఖరిని ఆక్షేపించారు. 


logo