శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 28, 2020 , 09:32:21

అధ్య‌క్ష ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌వు: ట‌్రంప్‌

అధ్య‌క్ష ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌వు: ట‌్రంప్‌

న్యూఢిల్లీ: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌బోవ‌ని అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ప‌ష్టంచేశారు.  ముందుగా నిర్ణ‌యించిన ప్రకారం నవంబర్ 3న అధ్య‌క్ష‌‌ ఎన్నికలు జరుగుతాయని ఆయ‌న తెలిపారు. సోమ‌వారం మీడియాతో మాట్లాడిన ట్రంప్‌‌.. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో అధ్య‌క్ష ఎన్నిక‌ల‌ షెడ్యూల్‌లో మార్పులు ఉంటాయా? అన్న ప్రశ్నకు ట్రంప్ పై విధంగా సమాధానం ఇచ్చారు. కాగా, ప్ర‌స్తుతం నెల‌కొన్న‌‌ క్లిష్ట ప‌రిస్థితుల్లో అధ్యక్షుడు ట్రంప్‌ ఎన్నికలు వాయిదావేసే విషయమై ఆలోచించాలని ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న జో బిడెన్ ఇటీవ‌ల డిమాండ్ చేశారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo