ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Jul 31, 2020 , 02:26:00

అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలి

అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలి

  • మెయిల్‌-ఇన్‌ ఓటింగ్‌తో అవకతవకలు: ట్రంప్‌ ట్వీట్‌

వాషింగ్టన్‌: నవంబరులో జరగాల్సిన అమెరికా అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ప్రజలు సరిగ్గా, భద్రంగా, సురక్షితంగా ఓటు వేయగలిగేవరకు ఎన్నికలను వాయిదా వేయాలని గురువారం ట్వీట్‌ చేశారు. మెయిల్‌-ఇన్‌ ఓటింగ్‌కు అనుమతి ఇస్తే ఎన్నికల్లో అవకతవకలు జరుగుతాయని, ఫలితాలు తారుమారు కావొచ్చని అన్నారు. అలా జరిగితే ఈ ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అవమానకరమైన సంఘటనగా మిగిలిపోతాయన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మెయిల్‌ ద్వారా ఓటేసే సదుపాయాన్ని కల్పించాలని రాష్ర్టాలు కోరుతున్నాయి. అయితే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. మరోవైపు,  చైనా, రష్యా, భారత్‌లు తమ దేశాల్లో పర్యావరణ పరిరక్షణను పట్టించుకోవని ట్రంప్‌ ఆరోపించారు. అమెరికా మాత్రం ఆ పని చేస్తుందని చెప్పుకొచ్చారు. కర్బన ఉద్గారాల తగ్గింపునకు సంబంధించిన పారిస్‌ ఒప్పందం నుంచి అమెరికా బయటకు రావాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని ఆయన మరోమారు సమర్థించుకున్నారు. 


logo