సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 13, 2020 , 16:08:46

ఆ పోరాటం నేటికీ కొసాగుతుంది : కమలాదేవి హారిస్‌

ఆ పోరాటం నేటికీ కొసాగుతుంది : కమలాదేవి హారిస్‌

విల్మింగ్టన్‌ : డెమోక్రాటిక్ పార్టీ నుంచి అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన తరువాత కమలా హారిస్ తొలిసారి విల్మింగ్టన్‌ ప్రజలతో సమావేశమయ్యారు. అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌తో కలిసి విల్మింగ్టన్కు వచ్చారు. అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో కమలాదేవి హారిస్‌ ప్రసంగించారు. 

"నా తల్లిదండ్రులు ప్రజల హక్కుల కోసం ప్రదర్శనలు చేశేవారు. అన్యాయానికి వ్యతిరేకంగా ఆ సమయంలో ప్రారంభించిన పోరాటం నేటికీ కొనసాగుతోంది. నా తల్లి, తండ్రి ప్రపంచంలోని రెండు వేర్వేరు ప్రాంతాలైన భారత్ జమైకా నుంచి అమెరికా వచ్చారు. ప్రపంచ స్థాయి విద్యను అందుకోవడానికి వారు ఇక్కడకు చేరుకున్నారు. 1960 లో అమెరికాలో ప్రారంభమైన పౌర హక్కుల ఉద్యమం కారణంగా ఇద్దరూ దగ్గరయ్యారు. నా తండ్రి విద్యార్థిగా ఉంటూనే ఉద్యమాల్లో పాల్గొన్నారు. నేను ఆ సమయంలో ఒక చిన్న అమ్మాయిని. తన భుజాలపై కూర్చుండబెట్టుకుని నా తండ్రి నన్ను ప్రదర్శనలకు తీసుకువచ్చేవాడు'' అని కమలాదేవి హారిస్‌ చెప్పారు.

ఈ నాయకత్వం నుంచి బయటకు రావాలని దేశం ఏడుస్తోంది

"గత కొన్ని సంవత్సరాలుగా మేము జాత్యహంకారం, అన్యాయం గురించి కొత్త విషయాలను అనుభవించాం. ఇప్పుడు ప్రజలు వీధుల్లోకి వచ్చి మార్పు కోరుతున్నారు. ప్రస్తుత నాయకత్వం నుంచి బయట పడాలని దేశ ప్రజలు కేకలు వేస్తున్నారు. ట్రంప్ దేశంలో జాత్యహంకారాన్ని ప్రోత్సహించారు'' అని ఆరోపించారు. 

కమలా పేరు ప్రకటించగానే వేగంగా నిధులు

కమలాదేవి హారి‌స్‌ను అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన మరుక్షణం నుంచే పార్టీకి నిధులు వెల్లువెత్తుతున్నాయి. గత 24 గంటల్లో డెమోక్రాటిక్ పార్టీకి 26 మిలియన్ డాలర్ల (సుమారు రూ.194 కోట్లు) నిధులు వచ్చాయి. ఈ మొత్తం మొదటి రోజులో వచ్చిన నిధుల కంటే రెట్టింపు అని బిడెన్ ప్రచారం ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న రోజుల్లో డెమోక్రాటిక్‌ పార్టీకి నిధులు మరింత ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


logo