గురువారం 26 నవంబర్ 2020
International - Nov 08, 2020 , 18:58:25

5 ల‌క్ష‌ల మంది భార‌తీయుల‌కు అమెరికా పౌర‌స‌త్వం క‌ల్పించ‌నున్న బైడెన్‌!

5 ల‌క్ష‌ల మంది భార‌తీయుల‌కు అమెరికా పౌర‌స‌త్వం క‌ల్పించ‌నున్న బైడెన్‌!

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బైడెన్ వ‌ల‌స‌దారుల విష‌యంలో ఉదారంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దాదాపు 1.1 కోట్ల మంది వ‌ల‌స‌దారుల‌కు బైడెన్ అమెరికా పౌర‌స‌త్వం క‌ల్పించే విష‌యమై కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌నున్నార‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే 5,00,000 మంది భారీతీయుల‌కు బైడెన్ అమెరికా పౌర‌సత్వం క‌ల్పించే అవ‌కాశం ఉన్న‌ది. 

అంతేగాక ఏటా 95 వేల మంది శ‌ర‌ణార్థుల‌ను అమెరికాలోకి అనుమ‌తించే అంశాన్ని కూడా బైడెన్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోనున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఈ మేర‌కు బైడెన్ ప్ర‌చార బృందం విదేశాంగ విధానంపై ఓ విధాన ప‌త్రాన్ని విడుద‌ల చేసింది. కుటుంబ ఆధారిత వ‌ల‌స విధానానికి బైడెన్ మద్ద‌తు ఉంటుంద‌ని ఆ విధాన ప‌త్రం పేర్కొన్న‌ది. కుటుంబ ఐక్య‌త‌కు అమెరికా ఇమ్మిగ్రేష‌న్ వ్య‌వ‌స్థ‌లో ఉన్నా ప్రాధాన్యాన్ని ప‌రిర‌క్షిస్తామ‌ని తెలిపింది. 

కుటుంబ వీసా బ్యాక్‌లాగ్‌ల‌ను సైతం త‌గ్గించ‌డానికి కృషి చేస్తామ‌ని విధాన ప‌త్రం వివ‌రించింది. బైడెన్‌ అధికార బాధ్య‌త‌లు స్వీకరించిన వెంట‌నే ఈ మేర‌కు చ‌ట్టస‌భ‌ల‌తో చ‌ర్చించ‌నున్న‌ట్లు పేర్కొన్న‌ది. గ్రీన్ కార్డుల జారీ, ఇత‌ర వ‌ల‌స‌, వ‌ల‌సేత‌ర వీసాల‌పై ట్రంప్ విధించిన ఆంక్ష‌ల‌ను సైతం బైడెన్ స‌డ‌లిస్తార‌ని తెలిపింది. శాశ్వ‌త నివాస హోదా క‌ల్పించే గ్రీన్ కార్డుల జారీని పెంచుతార‌ని వెల్ల‌డించింది. హెచ్‌1బీ విసాదారుల భాగ‌స్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకునే వ‌స‌తిని పున‌రుద్ధ‌రించే అవ‌కాశం ఉన్న‌ది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.