శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
International - Jan 22, 2021 , 20:59:55

ట్రంప్‌ వాడే ‘రెడ్‌ బటన్‌’ తొలగించిన బైడెన్‌

ట్రంప్‌ వాడే ‘రెడ్‌ బటన్‌’ తొలగించిన బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా కొత్త అధ్యక్షుడు జో  బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు సంబంధించిన వాటిని పూర్తిగా పక్కన పెడుతున్నారు. ట్రంప్‌ తీసుకున్న పలు నిర్ణయాలను వెనక్కి తీసుకున్న బైడెన్‌ తాజాగా వైట్‌హౌస్‌లోని అధికార ఓవల్‌ కార్యాలయంలో కూడా పలు మార్పులు చేశారు. కోక్‌ కోసం టేబుల్‌పై ట్రంప్‌ వినియోగించే ‘రెడ్‌ బటన్‌’ను తొలగించారు. బైడెన్‌ను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్‌ టామ్ న్యూటన్ డన్ ఈ విషయాన్ని గమనించి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

గతంలో ట్రంప్‌ను ఇంటర్యూ చేసినప్పుడు టేబుల్‌పై ఒక రెడ్‌ బటన్‌ ఉండేదని ఆయన తెలిపారు. దానిని ట్రంప్‌ నొక్కగానే ఒక సేవకుడు వెండి పళ్లెంలో డైట్‌ కోక్‌ తెచ్చి ఆయనకు ఇచ్చేవారని గుర్తు చేశారు. తాజాగా బైడెన్‌ ఇంటర్వ్యూ సమయంలో ఆ ‘రెడ్ బటన్‌’ అక్కడ లేదన్నారు. బైడెన్‌ దానిని తొలగించి ఉంటారని జర్నలిస్ట్‌ టామ్ న్యూటన్ డన్ పేర్కొన్నారు. అలాగే ట్రంప్ వినియోగించిన కుర్చీతోపాటు పలు వస్తువులను బైడెన్‌ మార్చారని వెల్లడించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo